Chandrababu: తొలుత ఎంపీలు, ఆపై మంత్రులు, మధ్యాహ్నం కోర్ కమిటీతో చంద్రబాబు వరుస భేటీలు... అజెండా మాత్రం ఒకటే!

  • బీజేపీతో కలసి కొనసాగాలా? వద్దా?
  • ఒకే ఒక్క అంశంపై పలు విభాగాలతో చర్చలు
  • వరుస భేటీలతో చంద్రబాబు బిజీబిజీ
  • ప్రస్తుతం మంత్రులతో సమావేశం
  • అది కాగానే కోర్ కమిటీతో భేటీ

నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)లో కొనసాగాలా? వద్దా? ఈ విషయాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు వరుస భేటీలు నిర్వహించనున్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందు పార్టీలోని అన్ని విభాగాల అభిప్రాయాలనూ అడిగి తెలుసుకోవాలని భావిస్తున్న ఆయన, ఈ ఉదయం ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆపై ప్రస్తుతం ఆయన పలువురు మంత్రులను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు.

 ఈ సమావేశం తరువాత ఆయన టీడీపీ కోర్ కమిటీతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, కేంద్ర మంత్రుల రాజీనామా తరువాత, ఎన్టీయేలో భాగస్వామిగా కొనసాగుతామని ప్రకటించడంలో అర్థం లేదని, మంత్రుల రాజీనామా తరువాత ప్రభుత్వంతో కలిసుంటామని అంటే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పలువురు నేతలు చంద్రబాబు ముందు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీతో పొత్తు తెగదెంపుల దిశగా చంద్రబాబు కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News