illiana 'd'cruz: అజయ్ దేవగణ్ తో నాకు సంబంధమా?... ఫన్నీ: ఇలియానా

  • అజయ్, అర్జున్ నాకు ఆఫర్లు ఇస్తున్నారు
  • రెండు సినిమాలు చేస్తే ఏదో ఉందని పుకారు పుట్టించేస్తారు
  • ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను

 తనకు ఆఫర్లు ఇవ్వాలని అజయ్ దేవగణ్ సిఫారసు చేస్తున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు వెలువడడంపై గోవా సుందరి ఇలియానా స్పందించింది. ఇలాంటి వార్తలు వినడానికి ఫన్నీగా ఉంటాయని చెప్పింది. తనను 'రైడ్' మూవీకి అజయ్ సిఫారసు చేశాడని, 'ముబారకన్' కో-స్టార్ అర్జున్ కపూర్ పరిశీలించమని తనవద్దకు ఒక స్క్రిప్టు పంపించాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

ఒక్క స్టార్ తో వరుసగా రెండు సినిమాలు చేస్తే ఏదో ఉందని పుకారు పుట్టించేస్తారని రుసరుసలాడింది. అవన్నీ వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఏదైనా తనకు నచ్చితేనే చేస్తానని ఇలియానా తెలిపింది. ప్రచారంలో ఉన్నట్టు అజయ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదని ఇలియానా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీ బోన్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 

illiana 'd'cruz
ajay devgan
movie offers
  • Loading...

More Telugu News