Sridevi: హరిద్వార్‌లోనూ శ్రీదేవి అస్థికల నిమజ్జనం..!

  • హరిద్వార్‌లోని వీఐపీ ఘాట్‌లో శ్రీదేవి అస్థికల నిమజ్జనం
  • తొలుత రామేశ్వరంలో నిమజ్జనం చేసిన కపూర్ కుటుంబం
  • అతిలోకసుందరి చనిపోయి నేటికి 13 రోజులు

అభిమానులను, అయినవాళ్లను విషాదంలో ముంచెళ్లిన అతిలోకసుందరి శ్రీదేవి అస్థికలను తొలుత తమిళనాడులోని రామేశ్వరంలో నిమజ్జనం చేసిన ఆమె కుటుంబం ఈ రోజు హరిద్వార్‌లోనూ అదే రకమైన తంతును పూర్తి చేసింది. ఆమె చనిపోయి నేటికి 13 రోజులు. శ్రీదేవి అస్థికల్లో కొంత భాగాన్ని భర్త బోనీ కపూర్ ఆయన సోదరుడు అనిల్ కపూర్‌‌లు డిజైనర్ మనీశ్ మల్హోత్రా, అమర్ సింగ్ ఇతర కుటుంబసభ్యులు కలిసి హరిద్వార్‌లో ఈ రోజు నిమజ్జనం చేశారు. వారంతా అక్కడ వీఐపీ ఘాట్‌లో ఆమె ఆత్మశాంతి కోసం పూజలు నిర్వహించారు.

కాగా, దక్షిణాది హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అస్థికలను తొలుత రామేశ్వరం వద్ద ఉన్న బంగాళాఖాతంలో కలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ పాల్గొన్న సంగతి విదితమే.

Sridevi
Boney kapoor
Maneesh malhotra
Haridwar
Ashes
  • Loading...

More Telugu News