rajani: 'కాలా'లో నటించిన కుక్కకి .. కళ్లు తిరిగిపోయే ఆఫర్!

  • ఈ కుక్క చెన్నైలోని ఓ వీధిలో దొరికింది 
  • ఇదంటే రజనీకి ఎంతో ఇష్టం 
  • దీనిని కొనడానికి చాలామంది పోటీ పడుతున్నారు     

'కాలా' సినిమాలో టైటిల్ కి తగినట్టుగానే రజనీకాంత్ పవర్ఫుల్ డాన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పెంపుడు జంతువుగా 'మణి' అనే ఓ కుక్క నటించింది. పోస్టర్స్ లోను ఈ కుక్కను హైలైట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ కుక్కకి క్రేజ్ పెరిగిపోయింది .. దాని దశ తిరిగిపోయింది. రజనీకాంత్ తో కలిసి నటించడం వలన ఈ కుక్కకి భారీస్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది.

 దాంతో దానిని దక్కించుకోవడానికి చాలామంది పోటీపడుతున్నారని ట్రైనర్ 'సిమన్' చెబుతున్నాడు. సినిమాలకి అవసరమైనప్పుడు ఆయన కావలసిన కుక్కలను తీసుకొచ్చి.. వాటితో నటింపజేస్తుంటాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "చెన్నైలోని ఓ రోడ్ పైన 'మణి' దొరికింది . . చాలా కుక్కలను పరిశీలించిన తరువాత దర్శకుడు రంజిత్ ఈ కుక్కను ఓకే చేశాడు. రజనీ సార్ కి ఈ కుక్క అంటే చాలా ఇష్టం .. షూటింగ్ జరిగినన్నినాళ్లు ఆయన దానిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దాని కోసం ప్రత్యేకమైన బిస్కట్లు తెచ్చేవారు. ఇప్పుడు ఈ కుక్కను కొనడానికి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకూ ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను దీనిని అమ్మదలచుకోలేదు .. ఎందుకంటే నేను దీన్ని ఓ బిడ్డలా చూసుకుంటున్నాను" అని ఆయన చెప్పుకొచ్చాడు.      

  • Loading...

More Telugu News