Chandrababu: కామినేని, పైడికొండల సేవలను ప్రశంసించిన చంద్రబాబు

  • కామినేని, పైడికొండల సమర్థవంతమైన సేవలందించారు
  • కృష్ణా, గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించారు
  • ఆరోగ్యశాఖలో సంస్కరణలు అమలు చేశారు

వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తరపున ఎంపికైన ఇద్దరు మంత్రులు సమర్థవంతంగా పని చేశారని అన్నారు.

క్లిష్టమైన కృష్ణా, గోదావరి పుష్కరాలను మంత్రి మాణిక్యాలరావు సమర్థవంతంగా నిర్వహించారని కితాబునిచ్చారు. దేవాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, ఆదాయ మార్గాలు పెరిగేలా కృషి చేశారని ఆయన సేవలను బాబు కొనియాడారు. వైద్య ఆరోగ్యశాఖలో కామినేని శ్రీనివాస్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని ఆయన ప్రశంసించారు. ఒక ముఖ్యమంత్రిగా వారి సమర్థవంతమైన సేవలను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. దీంతో కేబినెట్ సహచరులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. 

Chandrababu
Kamineni Srinivas
paidikondala manikyalarao
  • Loading...

More Telugu News