coco cola: కోకకోలా నుంచి తొలి ఆల్కహాలిక్ బెవరేజ్... క్యాన్ రూపంలో జపాన్ మార్కెట్లో విడుదల

  • జపాన్ మార్కెట్ కోసం అభివృద్ధి
  • షోచు పానీయం ఆధారంగా తయారీ
  • మార్కెట్ వాటాను పెంచుకునే యత్నం

శీతల పానీయాల్లో ప్రపంచ ప్రసిద్ధ కోకకోలా కంపెనీ తొలిసారిగా ఆల్కహాల్ తో కూడిన డ్రింక్ ను అభివృద్ధి చేసింది. దీన్ని క్యాన్ రూపంలో జపాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. జపనీస్ కు చెందిన పానీయం షోచు ఆధారంగా తయారు చేసిన ఈ డ్రింక్ పేరు చుహి.

‘‘మా కంపెనీ చరిత్రలో ఇది ప్రత్యేకం. కోకకోలా పూర్తిగా ఆల్కహాల్ రహిత పానీయాలపైనే దృష్టి సారించే కంపెనీ. ఇది ఓ నిరాడంబరమైన ప్రయోగం’’ అని కోకకోలా జపాన్ వ్యాపార విభాగం ప్రెసిడెంట్ జార్జ్ గార్డునో తెలిపారు. జపాన్ మార్కెట్ ఎంతో పోటీతో కూడుకున్నదని, ఇక్కడ ఏటా 100 ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.

జపనీస్ పానీయాల మార్కెట్ సహజ స్వభావం రీత్యా చుహి డ్రింక్ ను ఇతర మార్కెట్లో ప్రవేశపెట్టకపోవచ్చన్నారు. జపాన్ మార్కెట్లో జార్జియా కాఫీ అనే ఒక్క క్యాన్డ్ కాఫీ డ్రింక్ ద్వారానే కోకకోలా ఏటా బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

  • Loading...

More Telugu News