Kamineni Srinivas: చంద్రబాబులా ఎవరూ కష్టపడలేరు.. ఏపీకి ఆయన అవసరం ఉంది: అసెంబ్లీలో ఉద్వేగానికి లోనైన కామినేని

  • రాష్ట్రం కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు
  • నేను అజాత శత్రువును
  • శక్తి మేరకు అన్నీ చేశాను

బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం అసెంబ్లీలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడినంతగా ఎవరూ కష్టపడలేదని ఆయన అన్నారు. చంద్రబాబులాంటి నేత రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పారు. రాష్ట్రాన్ని ఉన్నత పథంలోకి తీసుకెళ్లడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

తాను అజాత శత్రువునని అన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన కాలంలో, అందరితోనూ తాను స్నేహంగానే మెలిగానని చెప్పారు. తన శక్తిమేరకు తన పరిధిలో అన్నీ చేశానని... కొన్ని చేయలేకపోయి ఉండవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనకు ఎంతో సహకారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా కామినేని ఉద్వేగానికి లోనయ్యారు. తనకు మంత్రి పదవి రావడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడే కారణమని చెప్పారు.

Kamineni Srinivas
Chandrababu
assembly
  • Loading...

More Telugu News