Kamineni Srinivas: కటీఫ్.. చంద్రబాబుకు రాజీనామాలు సమర్పించిన బీజేపీ మంత్రులు!

  • చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కామినేని, మాణిక్యాలరావు
  • మంత్రులుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
  • విలువలకు కట్టుబడి పనిచేశారన్న చంద్రబాబు

మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీల మధ్య అనుబంధం బీటలు వారింది. టీడీపీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు రాజీనామాలు సమర్పించడానికి రెడీ అవుతున్న తరుణంలో... ఏపీలో కూడా ఇలాంటి పరిణామాలే సంభవించాయి. బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజీనామా లేఖలను సమర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వీరిద్దరూ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రులుగా తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరిపై చంద్రబాబు కూడా ప్రశంసలు కురిపించారు. విలువలకు కట్టుబడి పనిచేశారంటూ కితాబిచ్చారు. మరోవైపు, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే సుజనా, అశోక్ లు తమ రాజీనామాలపై ప్రకటన చేయనున్నారు. 

Kamineni Srinivas
manikyala rao
resignations
Chandrababu
BJP
  • Loading...

More Telugu News