Kamineni Srinivas: కామినేనిని బాధపడవద్దన్న అచ్చెన్న.. సంతోషంగానే ఉన్నానన్న కామినేని!

  • ఐడీ కార్డులు, వాహనాలు సరెండర్ చేసిన తరువాత అసెంబ్లీకి వెళ్లిన కామినేని
  • అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడ్డ గంటా, అచ్చెన్నాయుడు
  • కామినేనితో మాటకలిపిన అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేడు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన బీజేపీ మంత్రులు ఐడీ కార్డులు, అధికారిక వాహనాలు సరెండర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లాబీల్లో మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు కామినేనితో మాట కలుపుతూ, 'అన్నా! బాధపడకు' అన్నారు. దానికి కామినేనిని సమాధానమిస్తూ, 'నేను చాలా సంతోషంగా ఉన్నాను' అన్నారు. మళ్లీ ఆయనే 'నాకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. 

Kamineni Srinivas
achennaidu
Ganta Srinivasa Rao
asembli
  • Loading...

More Telugu News