Jagan: మీరిద్దరూ రావడం సరికాదు... అయినా కేక్ తిని పొండి!: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విలేకరులతో జగన్!

  • నా మీడియా సమావేశాల నుంచి ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని బహిష్కరించా
  • సాక్ష్యాధారాలు లేకుండా వార్తలు రాశారు
  • వాటిని నమ్మవద్దని ఎన్నోమార్లు చెప్పాను
  • మీడియా సమావేశంలో వైఎస్ జగన్

తన మీడియా సమావేశాలకు రారాదని ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్ సంస్థలకు తాను ఎన్నడో స్పష్టం చేశానని, అయినా ఆ పత్రికల ప్రతినిధులు వచ్చారని, ఇలా రావడం సరికాదని, ఇప్పటికి ఓకే, ఇకపై రావద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లా సంతరావూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, అంతకుముందు అక్కడి స్థానిక విలేకరులను పేర్లు అడిగి తెలుసుకుని పలకరించారు.

ఆంధ్రజ్యోతి నుంచి ప్రసాద్, ఏబీఎన్ చానల్ నుంచి సురేష్ ఈ సమావేశానికి వచ్చారు. వారిని 'అన్నా అన్నా' అని పలకరించిన జగన్, "మీ ఇద్దరూ రావడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ, లెట్స్ గో దిస్ మూమెంట్. నెక్ట్స్ టైమ్... మనం వద్దని చెప్పినప్పుడు... ఆ పేపర్ ను, ఆ టీవీని పబ్లిక్ గా కోర్టులో కేసు వేశాం. మీరు రాసిన రాతలు, సాక్ష్యాధారాలు లేకుండా అన్యాయంగా, ఇన్టెన్షనల్ గా... కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రజ్యోతి అనే పేపర్ ను, ఏబీఎన్ అనే చానల్ ను వైఎస్ఆర్ సీపీ బాయ్ కాట్ చేసింది. రావద్దని వారి పేపర్ లో రాసే రాతలు, టీవీలో చూపే వార్తలను నమ్మవద్దని ఎన్నోసార్లు చెప్పాను. మీరు వచ్చారు కాబట్టి కేక్ తిని పొండి" అని అన్నారు.

Jagan
YSRCP
Prakasam District
Santaravuru
ABN
Andhra Jyoti
Reporters
  • Loading...

More Telugu News