Rajasthan: రాజస్థాన్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి షాక్

  • ఇటీవల రాజస్థాన్ లో జరిగిన రెండు ఎంపీ ఉపఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీ
  • లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీకి పరాభవం
  •  అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ 

రాజస్థాన్‌ లో బీజేపీకి మరోసారి షాక్ తగలింది. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో కూడా షాక్ తగిలింది. రాజస్థాన్ లో 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నికలు జరగగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది.

వాటి వివరాల్లోకి వెళ్తే..  ఆరు జిల్లా పరిషత్ సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, నాలుగు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి గెల్చుకున్నారు. ఇక 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్ 12, బీజేపీ 8, ఇండిపెండెంట్ ఒకటి గెల్చుకున్నారు. 

Rajasthan
local body by elections
election comission
  • Loading...

More Telugu News