Paidikondala Manikyalarao: అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను వెనక్కు ఇచ్చేసిన మంత్రులు కామినేని, పైడికొండల

  • బీజేపీ పెద్దలతో మాట్లాడిన పైడికొండల మాణిక్యాలరావు
  • ఈ ఉదయం క్యాబినెట్ సమావేశానికీ గైర్హాజరు
  • వాహనం, ఐడీ కార్డుల సరెండర్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇప్పటివరకూ భాగంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు తమ అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను వెనక్కు ఇచ్చేశారు. గత రాత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకోగా, ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని బీజేపీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉదయం తమ అధికారిక వాహనాలను, మంత్రులుగా తెలిపే ఐడీ కార్డులను వారు సరెండర్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ పెద్దలకు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. ఈ ఉదయం 2018-19 బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కాగా, దీనికి కూడా బీజేపీ మంత్రులు దూరంగా ఉన్నారు. వారు లేకుండానే బడ్జెట్ ఆమోదం పొందింది.

Paidikondala Manikyalarao
Kamineni Srinivas
Telugudesam
BJP
  • Loading...

More Telugu News