Congress MLA: కేరళ అసెంబ్లీ హాలులోకి టియర్ గ్యాస్ షెల్‌తో ప్రవేశించిన ఎంఎల్ఏ...కాసేపు కలకలం...!

  • వినియోగిత టియర్ గ్యాస్ షెల్‌తో సభలోకి వచ్చిన కొట్టాయం ఎంఎల్ఏ
  • యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఇలాంటి వాటితోనే చెదరగొట్టారని విమర్శ
  • పోలీసులు ఇప్పటికీ ఇలాంటి వాటినే వాడుతున్నారని వ్యాఖ్య

కేరళ అసెంబ్లీలోకి ఓ కాంగ్రెస్ ఎంఎల్ఏ ఈ రోజు వినియోగిత బాష్పవాయు గుండు(టియర్ గ్యాస్ షెల్‌)ను వెంట తీసుకురావడం కలకలం రేపింది. 68 ఏళ్ల తిరువంచూర్ రాధాకృష్ణన్ కొట్టాయం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీకి తీసుకొచ్చిన గుండును ఆయన స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్‌కి చూపించారు. ఆయన గుండును స్పీకర్‌కి చూపుతున్నప్పుడు సభలో కాసేపు కలకలం రేగింది. గతవారం ఆందోళన చేపడుతున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాడిన బాష్పవాయు గుళ్లు కాలం చెల్లిపోయినవని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి వాటినే పోలీసులు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తర్వాత ఈ షెల్‌ను ఆయన స్పీకర్‌కు సమర్పించారు.

Congress MLA
Thiruvanchoor Radhakrishnan
Kottayam constituency
  • Loading...

More Telugu News