vishnu kumar raju: ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు

  • ముఖ్యమంత్రి సుమారు రెండున్నర గంటలు నించొని ఉన్నారు
  • వారికి కొంత వెసులుబాటు కల్పించడం కోసం నేను లేచాను
  • మన పార్టీల మధ్య ఇంకా దోస్తీ ఉంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్రయోజనాల విషయంపై వెనక్కి తగ్గబోమని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చంద్రబాబు చెప్పారు. అయితే, ఆయన ప్రసంగిస్తుండగా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కల్పించుకుని, 'నేను మాట్లాడతాను' అన్నారు.

దీంతో ఏం చెబుతారో చెప్పండంటూ చంద్రబాబు నాయుడు కూర్చుకున్నారు. విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ... 'అధ్యక్షా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు రెండున్నర గంటలు నించొని ఉన్నారు. వారికి కొంత వెసులుబాటు కల్పించడం కోసం నేను లేచాను' అని అన్నారు. దీంతో అసెంబ్లీ సభ్యులంతా చిరునవ్వులు చిందించారు.

హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని విష్ణుకుమార్‌ రాజు గుర్తు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు ఏదో అనబోతుండడంతో 'మన పార్టీల మధ్య ఇంకా దోస్తీ ఉంది' అంటూ విష్ణుకుమార్ రాజు చమత్కరించారు. కాగా, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదని, త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదాను తమ మానిఫెస్టోలో పెట్టామని, కానీ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News