Congress: ఏపీ ప్రజల వెంటే ఉంటాం!: మల్లికార్జున ఖర్గే

  • ఏపీ కాంగ్రెస్ నేతల పోరాటం కొనసాగించాలి
  • విభజన చట్టంలోని హామీలను అమలు చేయని కేంద్రం
  • మేము అధికారంలోకొస్తే ప్రత్యేకహోదా ఇస్తాం : ఖర్గే

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీలో చేపట్టిన ఆత్మగౌరవ దీక్షలో ఎంపీ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రజల వెంటే తాము ఉంటామని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాలపై ఏపీ కాంగ్రెస్ నేతల పోరాటం కొనసాగించాలని అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మల్లికార్జున ఖర్గే అన్నారు.

Congress
mallikarjuna kharge
  • Loading...

More Telugu News