Special Category Status: ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కనిమొళి

  • ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’
  • మ‌ద్ద‌తు ప‌లికిన కనిమొళి
  • ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ దీక్ష‌కు త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే ఎంపీ కనిమొళి మ‌ద్ద‌తు ప‌లికి, దీక్ష‌లో కాసేపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

ఏపీ ప్ర‌జ‌ల‌ పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ రోజు ఈ దీక్ష‌లో కాంగ్రెస్‌ లోకసభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే  కూడా పాల్గొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను అమలు చేయాల్సిందేన‌ని అన్నారు. అధికారంలోకి వస్తే త‌మ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుంద‌ని తెలిపారు.   

Special Category Status
Andhra Pradesh
kanimoli
  • Loading...

More Telugu News