Chandrababu: విధిలేని పరిస్థితుల్లో ఆనాడు మన్మోహన్ సింగ్ హామీలిచ్చారు.. బీజేపీ న్యాయం చేస్తుందని పొత్తు పెట్టుకున్నాం: అసెంబ్లీలో చంద్రబాబు

  • రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర ఉంది
  • అందుకే బీజేపీ న్యాయం చేస్తుందని భావించాం
  • కేంద్రం నుంచి సహకారం అందడం లేదు

రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపజేసుకోవడం కోసం అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ విధిలేని పరిస్థితుల్లో పార్లమెంటులో ఎన్నో హామీలను ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలను ముఖ్యమంత్రి చదివి వినిపించారు.

కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినందుకే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు తిప్పి కొట్టారని తెలిపారు. ఏపీ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉందని చెప్పారు. అమరావతికి కట్టుబట్టలతో వచ్చామని... 2022నాటికి దేశంలోనే మూడో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని చెప్పారు. కేంద్రం నుంచి సహకారం అందడం లేదని తెలిపారు. 

  • Loading...

More Telugu News