bsp: బీఎస్పీ, ఎస్పీ అవగాహనపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు: ఎస్పీ

  • బద్ధ శత్రువైన పాశ్వాన్ తో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంది?
  • బిహార్ లో నితీశ్ కుమార్ విషయంలో ఏం జరిగింది?
  • రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు
  • బీఎస్పీతో అవగాహనను సమర్థించుకున్న ఎస్పీ

ఉత్తరప్రదేశ్ లోని రెండు లోక్ సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు బీఎస్పీతో అవగాహనను సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) సమర్థించుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరంటూనే దీనిపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని వ్యాఖ్యానించింది. ఎస్పీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్మయ్ నందా మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో తమ పార్టీ అవగాహనను రాజకీయ అనివార్యతగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆందోళనలో ఉన్నారని, అందుకే తమను పాము, ముంగీసలుగా అభివర్ణిస్తున్నారని చెప్పారు. తమ రెండు పార్టీల మధ్య అవగాహన ఏ మాత్రం ప్రభావం చూపించదన్నప్పుడు బీజేపీ నిత్యం తమపై దాడి చేయడం ఎందుకని ప్రశ్నించారు.

‘‘ఒకప్పుడు బద్ధశత్రువుగా ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్ తో బిహార్ లో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంది? బిహార్ లో నితీష్ కుమార్ తో పరిస్థితి ఏమైంది? ఒకప్పుడు ఎన్ డీఏతో ఉన్న కె.చంద్రశేఖర్ రావు బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు కదా? కనుక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అంటూ ఉండరు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరుగుతాయి’’ అని నందా అన్నారు.

  • Loading...

More Telugu News