kotamreddy sridhar reddy: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల నోటీసులు!

  • క్రికెట్ బెట్టింగ్ కేసులో కోటంరెడ్డికి నోటీసులు
  • ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఎమ్మెల్యే
  • రేపు 9 గంటలకు విచారణ

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపారు. క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించి మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులో ఆదేశించారు. బెట్టింగ్ డాన్ కృష్ణసింగ్ నుంచి కోటంరెడ్డికి నగదు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. కృష్ణసింగ్ కు షెల్టర్ ఇచ్చేందుకు కూడా కోటంరెడ్డి యత్నించారనేది పోలీసుల అభియోగం. క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి ఇప్పటికే కోటంరెడ్డి రెండుసార్లు పోలీసుల విచారణకు హాజరయ్యారు. రేపు ఉదయం 9 గంటలకు పోలీసు విచారణకు కోటంరెడ్డి హాజరుకానున్నారు. మరోవైపు, రాజ్యసభకు నామినేషన్లు జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు హాజరు కాలేనంటూ పోలీసులకు కోటంరెడ్డి చెప్పినట్టు కూడా సమాచారం.

kotamreddy sridhar reddy
YSRCP
mla
cricket betting
police notice
  • Loading...

More Telugu News