Lok Sabha: 30 సెకన్లలో లోక్ సభ, 3 నిమిషాల్లో రాజ్యసభ వాయిదా.. హోరెత్తుతున్న పార్లమెంట్!

  • ఆందోళనలతో వేడెక్కిన పార్లమెంట్
  • నినాదాలతో సభను అడ్డుకుంటున్న ఎంపీలు
  • ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డ ఉభయసభలు

పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్లకార్డులతో వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, తమతమ సమస్యల పట్ల ఇతర పార్టీల ఎంపీలు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో, అటు లోక్ సభ, ఇటు రాజ్యసభను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.

సభలను ఆర్డర్ లో పెట్టేందుకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ముఖ్యమైన విషయాలను చర్చించాల్సిన అవసరం ఉంది... సభలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలంటూ పలుమార్లు కోరినా సభ్యులు శాంతించలేదు. దీంతో, ప్రారంభమైన నిమిషం లోపే లోక్ సభ, మూడు నిమిషాల్లో రాజ్యసభ వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. 

Lok Sabha
Rajya Sabha
parliament sessions
  • Loading...

More Telugu News