Jhanvi kapoor: జాన్వీ బర్త్ డేలో కపూర్ కూతుళ్ల సందడి...ఆన్‌లైన్‌లో ఫొటోలు వైరల్

  • 21వ వసంతంలోకి అడుగుపెట్టిన ధడక్ హీరోయిన్
  • నిరాడంబరంగా పుట్టినరోజు వేడుకలు
  • పుట్టినరోజున ఒక్కచోట చేరిన కపూర్ కుమార్తెలు

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 21వ పుట్టినరోజు వేడుకల్లో బోనీ కపూర్ కూతుళ్లందరూ ఒక్కచోట మెరిశారు. నిన్న జరిగిన ఆమె బర్త్ డేకి పెద్దగా బయటవారిని ఎవ్వరినీ పిలవలేదు. కేవలం జాన్వీ కుటుంబం, ఆమె సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. వారందరి సమక్షంలోనే ఆమె కేక్ కట్ చేసి 21వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ పార్టీకి హాజరైన బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బర్త్ డేకి సంబంధించిన ఫొటోని పోస్ట్ చేసింది.

'కపూర్ అండ్ డాటర్స్' పేరుతో సోనమ్ ఈ ఫొటోని పోస్టు చేసింది. ఇందులో బోనీ కపూర్ కుమార్తెలు జాన్వీ, ఖుషీ, అన్షుల కపూర్‌లు కొవ్వొత్తులు, కేక్‌ల మధ్య ఉన్న సీన్ కెమేరాల్లో బందీ అయింది. ఈ ఫొటోలో సోనమ్, రియా, షనాయా, అన్షుల కపూర్, బోనీ కపూర్‍‌ని చూడవచ్చు. అంతకుముందు జాన్వీ ఓ అనాథాశ్రమానికి వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. 

Jhanvi kapoor
Boney kapoor
Kushi kapoor
Anshula kapoor
Birth Day
  • Loading...

More Telugu News