charan: 'రౌడీ నాయక్'గా తమిళంలోకి చరణ్ హిట్ మూవీ

  • చరణ్ మూవీస్ లో 'నాయక్'కి ప్రత్యేక స్థానం
  • తమిళంలోకి అనువాదం 
  • త్వరలోనే అక్కడ భారీ రిలీజ్        

తెలుగు యువ కథానాయకులలో చరణ్ కి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తూ అగ్రకథానాయకులతో ఒకరుగా ఆయన కొనసాగుతున్నాడు. తెలుగులో ఆయన చేసిన సూపర్ హిట్ చిత్రాలలో 'నాయక్' ఒకటి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్ సరసన కాజల్ .. అమలా పాల్ కథానాయికలుగా నటించారు.

 చరణ్ స్టార్ డమ్ ను పెంచేసిన సినిమాల జాబితాలో 'నాయక్' కూడా కనిపిస్తుంది. అలాంటి ఈ సినిమాను కోలీవుడ్ లోకి డబ్ చేస్తున్నారు. 'రౌడీ నాయక్' పేరుతో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయనున్నారు. చరణ్ తో పాటు కాజల్ .. అమలా పాల్ కి కూడా తమిళంలో మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం ఖాయమనే సంగతి తెలిసిందే.      

charan
kajal
amala paul
  • Loading...

More Telugu News