Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- సందిగ్ధం వద్దు, ప్రత్యేక హోదానే మన విధానం
- ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిందే
- కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా వివిధ రాష్ట్రాల్లో పార్టీలు గెలుస్తూనే ఉన్నాయి
- బీజేపీతో విడిపోయే అంశంపై తమ నేతలలో కొనసాగుతోన్న చంద్రబాబు చర్చ
ఆంధ్రప్రదేశ్‌కు పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలు లేవని, ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే, ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ ఈ రోజు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని, రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. ఎవ్వరికీ సందిగ్ధం వద్దని, ప్రత్యేక హోదానే మన విధానం అని, ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిందేనని ఉద్ఘాటించారు.
బీజేపీతో తెగదెంపులు చేసుకుందామని కొందరు టీడీపీ నేతలు సూచించిన నేపథ్యంలో వారికి అనుకూలంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా వివిధ రాష్ట్రాల్లో పార్టీలు గెలుస్తూనే ఉన్నాయని చెప్పారు. బీజేపీతో విడిపోయే అంశంపై ఆయన చర్చిస్తున్నారు.