jmm: థర్డ్‌ ఫ్రంట్‌లో చేరే అంశంపై వెనక్కి తగ్గి.. కేసీఆర్ కి షాకిచ్చిన జేఎంఎం!

  • థర్డ్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌తో మాట్లాడతానని ఇటీవలే చెప్పిన జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేస్తామని ఈ రోజు ప్రకటన
  • లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధం
  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చర్చించాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రెండు రోజుల క్రితమే స్పందించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్.. థర్డ్‌ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్‌తో తాను మాట్లాడానని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమైన నాయకులు కలిస్తే జాతీయ స్థాయిలోని పార్టీలను ఎదుర్కోవచ్చని అన్నారు. అయితే, ఆయన ఇప్పుడు తన నిర్ణయాన్ని అనూహ్యంగా మార్చుకున్నారు.

తాము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయమై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చర్చించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ నేతృత్వంలో కలిసి పని చేసే విషయంపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ మాజీ సీఎం అన్న విషయం తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News