usa: అప్పుల్లో మునిగి వున్న దేశాల జాబితా ఇదిగో!

  • జీడీపీకి మించి రుణ భారం
  • ఈ విషయంలో జపాన్ ముందంజ
  • ఈ దేశ జీడీపీ కంటే రుణ భారం రెండు రెట్లు ఎక్కువ
  • భారత జీడీపీలో రుణాలు 69.50 శాతం

దేశ స్థూల ఉత్పాదన విలువ (జీడీపీ) కు మించి రుణ భారాన్ని మోస్తున్నవి చాలానే ఉన్నాయి. అందులో 2017 గణంకాల ప్రకారం టాప్ టెన్ దేశాలను చూస్తే...

  • జపాన్ దేశ రుణ భారం 9 ట్రిలియన్ డాలర్లు. జీడీపీలో రుణాల నిష్పత్తి 220 శాతం. జీడీపీ కంటే రుణాలు రెండు రెట్లు అధికం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇది కూడా ఒకటన్న విషయం తెలిసిందే.
  • గ్రీస్ రుణ భారం 379 బిలియన్ డాలర్లు. జీడీపీలో రుణ నిష్పత్తి 179 శాతం. అధిక రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిరుద్యోగం, తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది.
  • పోర్చుగల్ రుణ భారం 264 బిలియన్ డాలర్లు. జీడీపీలో రుణాల నిష్పత్తి 138.08 శాతం. 2010 నుంచి ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం అందిస్తున్న నిధుల సాయం (రుణాలు)తో రోజులు నెట్టుకొస్తోంది.
  • ఇటలీ రుణ భారం 2.48 ట్రిలియన్ డాలర్లు. జీడీపీలో రుణ నిష్పత్తి 137.81 శాతం. ఆర్థిక వృద్ధి క్షీణత, అధిక నిరుద్యోగిత తదితర సమస్యలను ఎదుర్కొంటోంది.
  • భూటాన్ రుణ భారం 2.33 బిలియన్ డాలర్లు. జీడీపీలో రుణ నిష్పత్తి 118.6 శాతం. ఇది మన మిత్ర దేశం. భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత సంతోషంగా గడిపేందుకు అనువైన దేశంగా వర్ధిల్లుతోంది.
  • సైప్రస్ రుణ భారం 21.64 బిలియన్ డాలర్లు. జీడీపీలో రుణ నిష్పత్తి 115.47 శాతం.
  • బెల్జియం దేశ రుణ భారం 456 బిలియన్ డాలర్లు. జీడీపీలో రుణ నిష్పత్తి 114.78 శాతం. ఈ దేశానికి సహజ వనరులు చాలా తక్కువ. ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడే దేశం.
  • అమెరికా రుణ భారం 19.23 ట్రిలియన్ డాలర్లు. జీడీపీలో రుణాల నిష్పత్తి 106.1 శాతం. ప్రపంచంలోనే అగ్రరాజ్యం, సంపన్నదేశం అయిన అమెరికా అధిక రుణ భారాన్ని కూడా మోస్తోంది.
  • స్పెయిన్ దేశ రుణ భారం 1.24 ట్రిలియన్ డాలర్లు. జీడీపీలో రుణాలు 105.76 శాతం. ఈ దేశం ఆర్థిక మందగమనంలో నుంచి పునరుద్ధరణ బాటలో ఉంది.  
  • సింగపూర్ రుణ భారం 254 బిలియన్ డాలర్లు. జీడీపీలో రుణం నిష్పత్తి 104.07 శాతం. ప్రపంచంలో సంపన్న దేశాల్లో ఒకటి, నివాసయోగ్యమైన దేశాల్లోనూ చోటు సంపాదించుకున్న ఈ దేశానికి అప్పులు ఎక్కువే.
  • భారత్ రుణ భారం 495 బిలియన్ డార్లు. జీడీపీలో రుణాల నిష్పత్తి 69.50 శాతం. దేశం ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్న కొద్దీ ఈ రుణ భారం తగ్గే అవకాశాలుంటాయి. 

  • Loading...

More Telugu News