YSRCP: ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి... విదేశాలకు పంపుతున్న వైసీపీ?

  • రాజ్యసభ ఎన్నికలతో వేడెక్కిన రాజకీయం
  • క్యాంప్ రాజకీయాలకు తెరదీసిన వైసీపీ
  • టీడీపీతో టచ్ లో లేకుండా ఉంచేందుకు.. వైసీపీ జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని వైసీపీ నాయకత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా క్యాంపు రాజకీయాలకు వైసీపీ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలందరినీ, విదేశాలకు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. టీడీపీతో ఎమ్మెల్యేలు టచ్ లో ఉండకుండా చూసేందుకు, జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడో అభ్యర్థిని కూడా టీడీపీ నిలబెడితే, ఏం చేయాలనే దానిపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

YSRCP
Telugudesam
Rajya Sabha
elections
  • Loading...

More Telugu News