hebbah patel: హెబ్బా పటేల్ సన్నబడిందట .. మళ్లీ అదే హీరో జోడీగా ఛాన్స్ !

  • నాగ అశ్విన్ హీరోగా లవ్ స్టోరీ 
  • ఆయన జోడీగా మళ్లీ హెబ్బా 
  • త్వరలో సెట్స్ పైకి  

'కుమారి 21F' సినిమాతో యూత్ హృదయాలను హెబ్బా పటేల్ కొల్లగొట్టేసింది. ఆ తరువాత ఆమె చేసిన 'ఈడోరకం ఆడోరకం'.. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'  సినిమాలు ఆమెకి హిట్లు తెచ్చిపెట్టాయి. దాంతో ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయిగానీ .. అవి ఆమెకు సక్సెస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో సహజంగానే అవకాశాలు మందగించాయి.

తనకి అవకాశాలు రాకపోవడానికి .. బరువు పెరగడం కూడా  ఒక కారణమని భావించిన ఆమె, బాగానే కసరత్తు చేసి సన్నబడిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన ఈ సుందరి .. మరో ఛాన్స్ ను అందుకుంది. లండన్ గణేశ్ నిర్మించనున్న ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో నాగ అన్వేష్ హీరోగా చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'ఏంజెల్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అయినా హెబ్బాకి కలిసొస్తుందో లేదో చూడాలి.      

hebbah patel
naga anvesh
  • Loading...

More Telugu News