Vishnukumar Raju: చంద్రబాబును అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో: విష్ణుకుమార్ రాజుకు టీడీపీ కౌంటర్

  • చంద్రబాబును విమర్శించిన విష్ణుకుమార్ రాజు
  • ఆయన వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు
  • దమ్ముంటే విభజన హామీలను అమలు చేయించండి
  • లేకుంటే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని విమర్శలు

ఈ ఉదయం మీడియా ముందుకు వచ్చిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, సీఎం చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడగా, టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. విష్ణు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు, చంద్రబాబును ఓ మాట అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రంతో మాట్లాడి విభజన హామీలను అమలు చేయించాలని, అది వదిలేసి న్యాయమైన కోరికలను తీర్చాలని అడుగుతున్న టీడీపీని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.

బీజేపీ నేతలు తమ వైఖరిని మార్చుకుని కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు సహకరించాలని, లేకుంటే వారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ లో వైసీపీ చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి ఎంతమాత్రమూ లేదని వ్యాఖ్యానించిన ఆంజనేయులు, జగన్ కేవలం అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నాడని, ఆయన కోరిక నెరవేరే పరిస్థితి లేదని అన్నారు.

Vishnukumar Raju
MLA Anjaneyulu
Telugudesam
BJP
Congress
Jagan
  • Loading...

More Telugu News