Telugudesam: ఢిల్లీ వేడెక్కుతోంది... కొనసాగుతున్న ప్రత్యేక హోదా నిరసనలు!

  • తమదైన శైలిలో నిరసనలకు దిగిన పలు పార్టీలు
  • డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు
  • వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ నేతల విడివిడి ప్రదర్శనలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశ రాజధానిలో వేడిని పెంచుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాల రెండో రోజు కూడా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఈ ఉదయం టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు నిలబడి ప్లకార్డులు పట్టుకుని, ఏపీకి తక్షణం ప్రత్యేక హోదాను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్, వైకాపా కూడా ప్రత్యేకహోదా డిమాండ్‌ ఇవ్వాలని ఆందోళనకు దిగారు. మరోవైపు ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష పేరుతో మూడు రోజుల పాటు దీక్షలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హోదాపై వెంటనే చర్చించాలని పలు పార్టీలు లోక్ సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. రిజర్వేషన్లను తెలంగాణలో 50 శాతానికి మించి పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16ను సవరించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగింది. దీంతో పార్లమెంట్ ఆవరణంతా ప్లకార్డులు, ఎంపీల నినాదాలతో హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News