shrishri ravishankar: ముస్లింలు అయోధ్యపై హక్కులు వదులుకోవాలి: శ్రీశ్రీ రవిశంకర్ సూచన

  • అయోధ్యలో రామమందిర సమస్య పరిష్కారం కాకపోతే భారతదేశం, సిరియాలా మారుతుంది
  • వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేయడాన్ని ఇస్లాం అంగీకరించదు
  • అది వారు ప్రార్థనలు చేసే స్థలం కాదు

అయోధ్యలో రామమందిర సమస్య పరిష్కారం కాకపోతే భారతదేశం, సిరియాలా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతకొన్ని రోజులుగా అయోధ్య సమస్యకు పరిష్కారం వెదుకుతున్న ఆయన, గత నెలలో బెంగళూరులో పలువురు హిందూ, ముస్లిం మతగురువులతో చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం పలు ముస్లిం సంఘాలు, ఆయనను ఈ వివాదానికి దూరంగా ఉండాలని సూచించాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన, పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేయడాన్ని ఇస్లాం అంగీకరించదని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు అయోధ్యపై హక్కులను పూర్తిగా వదులుకోవాలని ఆయన సూచించారు. అది వారు ప్రార్థనలు చేసే స్థలం కాదని ఆయన చెప్పారు. శ్రీరాముడు మరో స్థలంలో జన్మించినట్లు చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. 

shrishri ravishankar
ayodhya
babri maszid
  • Loading...

More Telugu News