ponguleti: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి

  • చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్
  • ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థిక, హోంశాఖ
  • పిటిషన్‌ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని తెలిపిన సుప్రీంకోర్టు
  • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడుతూ టీడీపీ, వైసీపీ నేతలు నిరసనలు తెలుపుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఈ రోజు ఇదే విషయంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన అందులో కోరారు. చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని పొంగులేటి సుధాకర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.

ఇందులో ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థిక, హోంశాఖ, మానవ వనరుల అభివృద్ధి, జలవనరుల శాఖలను చేర్చారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్‌ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని తెలిపి, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.  

  • Loading...

More Telugu News