Chandrababu: లోక్‌సభ సభ్యులకు సీఎం చంద్రబాబు లేఖలు
- విభజన చట్టం హామీలు, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లేఖల్లో ప్రస్తావన
- పలువురు సభ్యులకు ఇప్పటికే చేరిన లేఖలు
- లేఖలు అందజేసిన టీడీపీ ఎంపీలు తోట నరసింహం, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్ నాయుడు
విభజన తరువాత తలెత్తిన ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పోరాటానికి దేశవాప్తంగా పలు పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖలను టీడీపీ ఎంపీలు ఈ రోజు లోక్‌సభ సభ్యులకు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని, విభజన చట్టం హామీలను లేఖల్లో ప్రస్తావించారు.
ఆ లేఖలను పార్లమెంటు సెంట్రల్ హాలులో బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్‌తో పాటు పలువురికి టీడీపీ ఎంపీలు తోట నరసింహం, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్ నాయుడు అందజేశారు. కాగా, అంతకు ముందు సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.