Holi: భంగ్ కొట్టి లేడీస్ హాస్టల్ లోకి అర్థనగ్నంగా ఎంబీబీఎస్ స్టూడెంట్... పట్నా ఎయిమ్స్ లో కలకలం!

  • కాలేజీలో హోలీ పార్టీ
  • కేవలం లుంగీతో లేడీస్ హాస్టల్ లోకి వెళ్లిన విద్యార్థి
  • కాలేజీ నుంచి పంపించేసిన మేనేజ్ మెంట్
  • కఠిన చర్యలకు విద్యార్థినుల డిమాండ్

పూటుగా మత్తుమందు పీల్చి, ఏం చేస్తున్నాడో తెలియని స్థితికి వెళ్లిపోయిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి, అర్థనగ్నంగా లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించిన ఘటన ప్రతిష్ఠాత్మక వైద్య విద్యాలయం పట్నా ఎయిమ్స్ లో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కాలేజీలో జరిగిన హోలీ పార్టీలోకి గంజాయి తదితర మత్తు పదార్థాలు వచ్చి చేరాయి. కేరళ నుంచి వచ్చి వైద్య విద్యను అభ్యసిస్తున్న యువకుడు కూడా అందులో పాల్గొన్నాడు.

"హిందుస్థాన్ టైమ్స్" లో ప్రచురితమైన కథనం ప్రకారం, ఈ ఘటన గత వారంలో జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న సదరు విద్యార్థి, కేవలం లుంగీ మాత్రమే ధరించి లేడీస్ హాస్టల్ లోకి జొరబడి నానా హంగామా చేశాడు. అతను అక్కడున్న సమయంలో పలుమార్లు లుంగీ జారిపోయింది. ఆపై హాస్టల్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతన్ని బయటకు గెంటేశారు. విషయం తెలుసుకున్న కాలేజ్ మేనేజ్ మెంట్ అతన్ని కాలేజీ నుంచి పంపించి వేసింది. జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విద్యార్థినులు సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, డీబార్ చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Holi
Patna
AIIMS
Bhang
Ladies Hostel
  • Loading...

More Telugu News