vjay devarakonda: రాజకీయవారసుడిగా ప్రేక్షకుల ముందుకు విజయ్ దేవరకొండ!

  • వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ
  • విడుదల దిశగా 'టాక్సీవాలా' .. 'ఏ మంత్రం వేశావే' 
  • తమిళంలో తాజా చిత్రం మొదలు  

'అర్జున్ రెడ్డి'తో వచ్చిన విపరీతమైన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి గాను విజయ్ దేవరకొండ తనవంతు కృషి చేస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ తన జోరు పెంచాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఆయన ఒక తమిళ సినిమా చేస్తున్నాడు.

 ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజునే హైదరాబాద్ లో మొదలైంది. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమా, రాజకీయాల నేపథ్యంలో కొనసాగుతుందట. రాజకీయ నాయకుడి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, ఆ రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందట. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, యూత్ ను ఆలోచింపజేసేదిగా ఉంటుందని అంటున్నారు.    

  • Loading...

More Telugu News