face book friendship: రవితేజ సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ టీవీ నటిపై లైంగిక వేధింపులు!

  • ఫేస్ బుక్ లో టీవీ నటికి పరిచయమైన జగదీశ్  
  • కల్యాణ్ కృష్ణ, రవితేజ సినిమాలో ఛాన్స్ ఆశపెట్టి ఫ్లాట్ కి రప్పించుకున్న వైనం   
  • అతని కోరిక తీర్చకపోవడంతో రెచ్చిపోయిన జగదీశ్  

రవితేజ సినిమాలో చాన్స్ ఇప్పిస్తానంటూ టీవీ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గచ్చిబౌలిలో నివాసముండే ఒక టీవీ నటికి ఫేస్ బుక్ ద్వారా జగదీశ్ పిచ్చికి అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందనున్న తాజా సినిమాలో క్యారెక్టర్ నటి అవకాశ కల్పిస్తానంటూ ఆమెను నమ్మబలికాడు. దాని కోసం మాట్లాడాలని ప్రగతినగర్లోని శ్రీ సాయిరామ్ మానర్ అపార్టుమెంట్‌ లోని 507 ఫ్లాట్‌కు రావాలని ఆమెకు సూచించాడు. దీంతో అపార్టుమెంట్ కు వెళ్లిన ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె అతనిని ప్రతిఘటించింది. దీంతో ఆమెపై దాడికి దిగి, బెల్టుతో ముఖం, వీపుపై కొట్టి బయటకు గెంటేశాడు. తీవ్ర అవమానభారంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

face book friendship
raviteja movie chance
tv actress harassed
  • Loading...

More Telugu News