mukesh ambani: వజ్రాల వ్యాపారి కుమార్తె శ్లోకతో ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ ప్రేమ వివాహం?

  • వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా చిన్న కుమార్తెతో ఆకాశ్ లవ్
  • ధీరూభాయ్ అంబానీ స్కూల్లో చదువుకునేటప్పుడే ప్రపోజ్
  • డిసెంబరులో వివాహం?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి వజ్రాల వ్యాపారి, రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబరులో వీరి విహాహం జరగనుండగా అతి త్వరలో నిశ్చితార్థం తేదీని ప్రకటించనున్నారు.

దీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆకాశ్, శ్లోక ఒకరినొకరు ఇష్టపడినట్టు సమాచారం. 12వ తరగతి బోర్డు పరీక్షల అనంతరం ఆకాశ్ తన ప్రేమను వ్యక్తపరచగా ఆమె కూడా అంగీకరించిందట. తాజాగా ఇరు కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించడంతో పెళ్లికి రెడీ అవుతున్నారు. కాగా, పెళ్లి వార్తలను ఇరు కుటుంబాలు ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.
 
ఆకాశ్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి అర్థ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం రిలయన్స్ జియో బోర్డులో కొనసాగుతున్నాడు. శ్లోక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో డిగ్రీ, ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయ విద్యలో లా పూర్తి చేశారు. 2014 నుంచి రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి పరారైన నీరవ్ మోదీకి రసెల్ మెహతా సతీమణి మోనా బంధువు.

mukesh ambani
Akash Ambani
Marriage
Sloka
  • Loading...

More Telugu News