kcr: దేశం నలుమూలల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి : సీఎం కేసీఆర్

  • పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాకు ఫోన్ చేశారు
  • కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలు విఫలమైన విషయం ప్రజలకు అర్థమైంది
  • 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి?: కేసీఆర్

అవసరమైతే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న తన ప్రకటనపై దేశ వ్యాప్తంగా పలువురు స్పందించారని, దేశం నలుమూలల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ని కలిసి పలు రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ‘పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాకు ఫోన్ చేశారు. దేశ రాజకీయాల్లో సంపూర్ణ మార్పు రావాల్సి ఉందన్న నా వాదనకు ఆమె మద్దతు ప్రకటించారు. నా వెంటే నడుస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ కూడా ఫోన్ చేశారు. జాతీయ స్థాయిలో మరో కూటమి ఏర్పాటు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఎంపీలు మద్దతు పలికారు, కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలు విఫలమైన విషయం ప్రజలకు అర్థమైంది. 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి? చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. ఏ కులమైనా, మతమైనా అందరం బాగుండాలి’ అన్నారు.

  • Loading...

More Telugu News