Mitv: 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.28,000, 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.20 వేల లోపే.. ఎంఐ బంపరాఫర్
- ఈ నెల 7న విడుదల
- ఎంఐ టీవీ 4సీ, ఫుల్ హెచ్ డీ, స్మార్ట్ టీవీ
- త్వరలో 32 అంగుళాల స్మార్ట్ టీవీ
షియోమీ భారత స్మార్ట్ టీవీ మార్కెట్ ను షేక్ చేసే విధంగా ఉత్పత్తుల విడుదలకు పూనుకున్నట్టుంది. ఇప్పటికే ఈ కంపెనీ ఎంఐ టీవీ4ను భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. 4కే హెచ్ డీఆర్ డిస్ ప్లేతో ఉన్న 55 అంగుళాల ఈ టీవీ ధర రూ.39,999. దీని కంటే తక్కువ ధరకు మరో టీవీనీ ఈ సంస్థ ఈ నెల 7న విడుదల చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎంఐ వెబ్ సైట్ http://event.mi.com/in/switchtosmart లో నోటిఫికేషన్ కూడా పెట్టింది.
43 అంగుళాల స్క్రీన్ తో ఉండే ఈ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ మోడల్ పేరు ఎంఐ టీవీ 4సీ. దీని ధర రూ.27,999. దీన్ని గతేడాది అక్టోబర్ లోనే షియోమీ చైనాలో విడుదల చేసింది. అక్కడ విక్రయిస్తున్న ధర మన మారకంలో చూస్తే రూ.19,000. కానీ, భారత్ లో మాత్రం అధిక ధర నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఎంఐ టీవీ 4సీలో 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ, క్వాడ్ కోర్ ఆమ్లోజిక్ టి962, 64 బిట్ ప్రాసెసర్, వైఫై, బ్లూటూత్, డాల్బీ, డీటీఎస్ ఆడియో, బ్లూ లైట్ ను తగ్గించుకునే మోడ్ (దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది) ఉన్నాయి. చైనాలో షియోమీ ఎంఐ టీవీ 4ఏను కూడా ఇటీవలే విడుదల చేసింది. అక్కడ దీని ధర సుమారు రూ.11,000. ఇది కూడా అతి త్వరలోనే భారత మార్కెట్లోకి రూ.20,000లోపు ధరకు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.