Krishnarjuna Yuddham: నేచురల్ స్టార్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతుంది..!

  • ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్లు వసూలు చేసిన ఎంసీఏ
  • ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేలా పక్కా ప్లాన్!
  • ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్‌లో బిజీ

టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న స్టార్ నాని. సహజ నటనను కనబరుస్తూ 'నేచురల్ స్టార్‌'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్ధం' చిత్రం షూటింగ్‌లో అతను బిజీబిజీగా ఉన్నాడు. ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో వినబడుతోంది. తనకున్న సక్సెస్ రేటును దృష్టిలో పెట్టుకుని నాని రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేశాడట. ఆ ఫిగర్ ఎంతో తెలిస్తే మనకు మతిపోవడం ఖాయం.

తన సినిమాలకు ఉన్న మార్కెట్ డిమాండ్‌ వల్ల ఒక్కో సినిమాకు రూ.9 కోట్ల పారితోషికాన్ని అతను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. నాని ఇదివరకు నటించిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల వసూళ్లను సాధించింది. నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేలా పక్కా ప్లాన్‌ను రచించుకుంటున్నట్లు తెలుస్తోంది. కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్లే అతనికి వరుస సక్సెస్‌లు దక్కుతున్నట్లు తెలుస్తోంది. అతని సినిమాల్లో కథే అసలు సిసలు హీరో అనడంలో సందేహం లేదు.

Krishnarjuna Yuddham
Natural Star Nani
Middle-Class Abbayi
  • Loading...

More Telugu News