Sridevi: మా అమ్మానాన్నల బంధాన్ని అపహాస్యం చేయకండి: శ్రీదేవి తనయ జాన్వీ వేడుకోలు!

  • శ్రీదేవి, బోనీలు అన్యోన్య దంపతులు
  • వారి ప్రేమను కించపరచ వద్దు
  • అభిమానులకు జాన్వీ కపూర్ వినతి

తన తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్ లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఉన్న బంధాన్ని అపహాస్యం చేయవద్దని వారి పెద్ద కుమార్తె జాన్వీ వేడుకుంది. నిన్న తనలోని మనో వేదనను తెలుపుతూ, తల్లి శ్రీదేవిని ఉద్దేశించి రాసిన ఓ లేఖను పోస్టు చేసిన జాన్వీ, ఆపై మరో పోస్టు పెట్టింది.

ప్రతి ఒక్కరూ వారి వారి తల్లిదండ్రులను ప్రేమించాలని, తన తల్లి ఆత్మ శాంతి కోసం ప్రార్థించాలని, అదే తనకు అభిమానులిచ్చే పుట్టిన రోజు బహుమానమని చెప్పింది. తన తల్లిదండ్రులు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న అనోన్యమైన జంటని, వారు ప్రేమించుకున్నారని, వారి ప్రేమను కించపరచ వద్దని వేడుకుంది. వారి బంధాన్ని గౌరవించాలని కోరింది. తాను, ఖుషీ తల్లిని కోల్పోతే, తమ తండ్రి సర్వస్వాన్నే పోగొట్టుకున్నారని వాపోయింది. తామిద్దరికీ తల్లిగా, తండ్రికి సహచరిగా ఆమె తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని వెల్లడించింది.

Sridevi
Boney Kapoor
Janvi
Letter
  • Loading...

More Telugu News