Sunil: కమెడియన్ గా కొత్త ప్రాజెక్టులతో సునీల్ బిజీబిజీ!

  • కమెడియన్‌గా మళ్లీ జోరుపెంచిన సునీల్
  • వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
  • సైరా నరసింహారెడ్డి, రవితేజ చిత్రాలతో ఫుల్ బిజీ

కమెడియన్‌గా చేస్తున్నప్పుడు సునీల్ దాదాపు ప్రతి సినిమాలోనూ కనిపించేవాడు. కానీ హీరో అయ్యాక అతని జోరు తగ్గింది. హీరోగా ఈ మధ్య అతనికి సరైన హిట్లు లేకపోవడంతో పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రలను సైతం చేయడానికి ఒప్పేసుకుంటున్నాడు. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అన్న చందంగా హీరోగానే చెయ్యాలి అనే ట్యాగు నుంచి సునీల్ బయటకు రావడంతో ఇప్పుడు అతని ఖాతాలో పలు సినిమాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో అతను మళ్లీ బిజీబిజీ అయిపోతున్నాడు.

ఈ క్రమంలో అల్లరి నరేష్-భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం, తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపొందనున్న చిత్రం, రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ చిత్రం, జూనియర్ ఎన్‌టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రంలోనూ సునీల్ నటించనున్నట్లు ఫిలింవర్గాల సమాచారం.

Sunil
Allari Naresh
Trivikram Srinivas
Mega Star Chiranjeevi
  • Loading...

More Telugu News