avasaral srinivas: అవసరాల శ్రీనివాస్ ప్రేమలో పడ్డ టాలీవుడ్ హీరోయిన్?

  • కలసి తిరుగుతున్న శ్రీనివాస్, ఈషా రెబ్బా
  • ప్రేమలో పడ్డారంటూ ఫిలింనగర్ టాక్
  • ఇంతవరకు స్పందించని శ్రీను, ఈషా

టాలీవుడ్ సర్కిల్ లో ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే యాక్టర్ అవసరాల శ్రీనివాస్, హీరోయిన్ ఈషా రెబ్బాలు ఇటీవల కాలంలో కలసి తిరుగుతున్నారట. వీరిద్దరూ ప్రేమలో పడిపోయారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై అటు శ్రీనివాస్ కానీ, ఇటు ఈషా రెబ్బా కానీ స్పందించలేదు. అవసరాల శ్రీనివాస్ ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నాడు. మరోవైపు వెంకటేష్ తో తేజ చేయనున్న సినిమాలో ఓ ముఖ్య పాత్రకు ఇషాను ఎంపిక చేసినట్టు సమాచారం. నారా రోహిత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. రోహిత్ సరసన ఈషా నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News