Sai pallavi: అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ఇలా చేస్తున్నాను... సాయి పల్లవి!

  • మేకప్ లేకుండా యాక్టింగ్ చేయడమే ఇష్టం
  • ఇందుకు ప్రేమమ్ దర్శకుడు పుతెరిన్ కారణం
  • సహజంగా నటించమని ఆయన ప్రోత్సహించారు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన 'ఫిదా' చిత్రంతో అందర్నీ ఫిదా చేసింది తమిళ ముద్దుగుమ్మ సాయి పల్లవి. మామూలుగా ఆమెను వెండితెరపై చూసినప్పుడు మేకప్ వేసుకున్నట్లుగా అనిపించదు. సహజంగా మన మధ్య తిరిగే అమ్మాయిలా కనిపిస్తుంది. మేకప్ వేసుకోకుండానే యాక్ట్ చేసేందుకు ఆమె ఇష్టపడుతుంటుంది. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు తానిలా చేస్తున్నానని ఈ బ్యూటీ చెప్పింది.

అంతేకాక ఆమె 'నో మేకప్' నిర్ణయం వెనుక ఓ చిన్న కథ కూడా ఉంది. తన తొలి సినిమా 'ప్రేమమ్' దర్శకుడు ఆల్ఫోన్స్ పుతెరిన్ సహజంగా నటించమని తనను ప్రోత్సహించారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే తాను ఎక్కువగా మేకప్ లేకుండానే నటించేందుకు ఇష్టపడతానని ఈ పింపుల్స్ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇతర దర్శకులు కూడా తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రోత్సహించారని ఆమె తెలిపింది. మరోవైపు నాగశౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన 'కణం' చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sai pallavi
Naga Saurya
Kanam
Fida
Sekhar Kammula
  • Loading...

More Telugu News