BJP: త్రిపురలో మేము ఊహించని స్ధానాల్లో కూడా గెలుస్తున్నాం: రామ్ మాధవ్
- త్రిపురలో 42 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమి
- వామపక్ష కూటమి ఆధిక్యంలో 16 స్థానాలు
- బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
2013 ఎన్నికల్లో త్రిపురలో కనీసం ఒక్కసీటు కూడా గెల్చుకోని బీజేపీ ఈసారి చరిత్ర నెలకొల్పింది. గత ఐదు పర్యాయాలు వామపక్ష పార్టీకి కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం 51 స్థానాల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నిజాయతీపరుడిగా పేరొందిన మాణిక్ సర్కార్ నేతృత్వంలోని వామపక్ష పార్టీల కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత రామ్ మాధవ్ తెలిపారు. త్రిపురలో తాము ఊహించని స్థానాల్లో కూడా ఆధిక్యంలోకి వస్తున్నామని ఆయన అన్నారు. మెజారిటీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబర్చడంతో బీజేపీ కార్యాలయాల్లో సందడి నెలకొంది. తుదిఫలితాల కోసం చూడకుండానే బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.