karthi: కార్తీ .. రకుల్ సినిమా షూటింగ్ ప్రారంభం

  • గతంలో 'ఖాకీ' చేసిన కార్తీ .. రకుల్ 
  • మరోసారి సెట్స్ పైకి ఈ కాంబినేషన్
  • దర్శకుడిగా రజత్ రవిశంకర్  

తమిళ .. తెలుగు భాషల్లో కార్తీకి మంచి క్రేజ్ వుంది. అందువలన ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలవుతూ ఉంటాయి. ఈ రోజు ఉదయం ఆయన తాజా చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. కార్తీ తండ్రితో పాటు సూర్య .. ఈ సినిమాలో కథానాయికగా చేయనున్న రకుల్ తదితరులు ఈ సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

కార్తీకి ఇది 17వ సినిమా.. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇంతకుముందు కార్తీ - రకుల్ కాంబినేషన్లో 'ఖాకీ ' సినిమా వచ్చింది. తమిళంలో బాగానే ఆడిన ఈ సినిమా .. తెలుగులో ఓ మాదిరి మార్కులను సంపాదించుకుంది. ఈ జంట ఈ సారైనా హిట్ కొడుతుందేమో చూడాలి.   

  • Loading...

More Telugu News