aaa movie: దర్శకత్వానికి ఓకే కానీ.. పొరపాటున కూడా నిర్మాతగా మాత్రం మారను: నిత్యామీనన్

  • 'అ' సినిమాలో లెస్బియన్ పాత్ర పోషించిన నిత్యామీనన్
  • కచ్చితంగా దర్శకత్వం చేస్తాను
  • సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం ఇష్టం 

నాని నిర్మాతగా వ్యవహరించిన ‘అ’ సినిమాలో నిత్యామీనన్ లెస్బియన్‌ పాత్ర పోషించి ఆకట్టుకుంది. నిర్మాతగా నాని విజయం సాధించడం పట్ల ఆనందంగా ఉన్నానని తెలిపిన నిత్య, పొరపాటున కూడా తాను నిర్మాతగా మారనని స్పష్టం చేసింది. అయితే భవిష్యత్ లో కచ్చితంగా ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పింది. దర్శకత్వంపై ఇప్పటి నుంచే అవగాహన పెంచుకుంటున్నానని ఆమె తెలిపింది.

అందుకే తాను నటించే సినిమాల్లో తన పాత్ర గురించి దర్శకుడితో లోతుగా చర్చిస్తానని తెలిపింది. పాత్ర డెవలెప్ చేయడం, సంభాషణల విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ వంటి వాటి గురించి స్పాట్ లో దర్శకుడితో చర్చిస్తుంటానని, సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి తెలుసుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నానని చెప్పింది.

భవిష్యత్ లో కచ్చితంగా మెగాఫోన్ పడతానని తెలిపింది. తనకు అవకాశాలు చాలానే వస్తున్నాయని, అయితే వచ్చిన అన్ని సినిమాల్లో నటించడం కుదరడం లేదని తెలిపింది. సాధారణ హీరోయిన్ పాత్రలను తాను కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేసింది.

aaa movie
nitya menon
nani
producer
director
  • Loading...

More Telugu News