Chandrababu: చిన్నారులను బుజ్జగించినట్లు వ్యవహరిస్తున్నారు: ఎంపీ జేసీ
- ఏపీకి నిధులు ఇవ్వమని కోరుతున్నాం
- మేము చేయాల్సిన పోరాటం మేము చేస్తాం
- ఎంపీలమంతా ఒకేమాటపై ఉంటాం
- చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక నిధులు ఇవ్వమని కోరుతుంటే చిన్నారులను బుజ్జగించినట్లు తమను బుజ్జగిస్తున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అతి తక్కువగా నిధులు వచ్చాయని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో తాము చేయాల్సిన పోరాటం తాము చేస్తామని తెలిపారు. ఎంపీలమంతా ఒకే మాటపై ఉంటామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే తుది నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని అన్నారు. మున్ముందు కేంద్ర ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలో చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు.