Jagan: హోలీ సంబరాల్లో హుషారుగా జగన్.. విద్యార్థినులతో సెల్ఫీ.. ఫొటోలు చూడండి

  • హోలీ సందర్భంగా జగన్ ను కలసిన విద్యార్థినులు
  • ఉత్సాహంగా హోలీ వేడుక
  • ప్రజల జీవితాలు రంగులమయం కావాలని ఆకాంక్షించిన జగన్

వైసీపీ అధినేత జగన్ ఈరోజు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో ఉన్న జగన్ ను భారీ సంఖ్యలో విద్యార్థినులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ తో కలసి వారు హోలీ వేడుకను జరుపుకున్నారు. జగన్ కూడా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. జగన్ కు రంగులు పూసి, హోలీ శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థినులు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో జగన్ సెల్ఫీ దిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగులమయం చేయాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. మరోవైపు, చీమకుర్తి నుంచి ఈ ఉదయం జగన్ పాదయాత్ర ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News