Sridevi: శ్రీదేవి నాకు చెల్లెలు లాంటిది... అలాంటి వదంతులు సృష్టించొద్దు!: కమలహాసన్

  • కల్పిత వార్తలపై కమల్ అసహనం 
  • శ్రీదేవి నాకు సోదర సమానురాలు
  • శ్రీదేవి తల్లి చేతి గోరుముద్దలు తిన్నాను 

దివంగత నటి శ్రీదేవితో కల్పిత గాథలను ప్రసారం చేస్తూ కోలీవుడ్ లో కథనాలు వెలువడడం పట్ల ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి సరైనది కాదని ఆయన హితవు పలికారు. దివంగత శ్రీదేవి తనకు సోదర సమానురాలని ఆయన స్పష్టం చేశారు. తాను కూడా ఆమెతో కలిసి ఆమె తల్లి చేతి గోరుముద్దలు తిన్నానని గుర్తు చేసుకున్నారు.

లేని పోని వదంతులు సృష్టించి ఇబ్బంది పెట్టవద్దని ఆయన మీడియాను కోరారు. కాగా, శ్రీదేవి, కమలహాసన్ జోడీ అత్యంత విజయవంతమైన జోడీగా కోలీవుడ్ లో పేరొందింది. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ లు గా నిలిచాయి. తాజాగా కమల్ రాజకీయ పార్టీని పెట్టారు. ఈ నేపథ్యంలో శ్రీదేవితో ఆయనకు సంబంధాలను అంటగడుతూ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. అందుకే, ఆయన తాజాగా ఈ వివరణను ఇచ్చారు.

Sridevi
Kamal Haasan
Tamilnadu
Makkal Needhi Mayyam
  • Loading...

More Telugu News