Sridevi: శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలి.. సీనియర్ నటి శారద

  • శ్రీదేవి కంటే నేను వయసులోనే పెద్ద
  • ఆమె నా కంటే అన్నింటిలోనూ ఎక్కువే
  • ‘భారతరత్న’తో గౌరవిస్తే అవార్డుకే అందమొస్తుంది

ఇటీవల మరణించిన ప్రముఖ నటి శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటి శ్రీదేవి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీదేవిని దేశానికి దక్కిన కోహినూర్‌గా ఆమె అభివర్ణించారు. తాను వయసులో మాత్రమే శ్రీదేవి కంటే పెద్దదానినని, నటన సహా మిగతా విషయాల్లో ఆమె కంటే తాను తక్కువేనని పేర్కొన్నారు. ‘కార్తీకదీపం’ సినిమా షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి శోభన్‌బాబు, తాను ఆశ్చర్యపోయినట్టు గుర్తు చేసుకున్నారు. అంతటి గొప్ప నటి ఆమె అని కొనియాడారు. ఆమెకు భారతరత్న దక్కితే ఆ అవార్డుకే అందం వస్తుందని శారద అన్నారు. 

Sridevi
Sharada
Bharat Ratna
  • Loading...

More Telugu News